గవర్నర్ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు పెను సమస్యలు సృష్టిస్తుంది: అరవింద్ కేజ్రీవాల్
- ఢిల్లీ వాసులకే చికిత్స అంటూ ఇంతక్రితం స్పష్టంచేసిన కేజ్రీవాల్
- సీఎం నిర్ణయంతో విభేదించిన లెఫ్టినెంట్ గవర్నర్
- గవర్నర్ నిర్ణయం పట్ల ఆందోళన వెలిబుచ్చిన కేజ్రీవాల్
"కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో దేశం నలుమూలల నుంచి వస్తున్న వారికి చికిత్స అందించడం ఓ పెద్ద సవాల్. దేశ ప్రజలందరికీ మేం చికిత్స అందించాలంటే ఆ దేవుడు దీవించాల్సిందే. అందరికీ చికిత్స అందించేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తాం" అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.