ఏడాదిలోపు బస్వాపూర్ నుంచి ఆలేరుకు నీళ్లు తీసుకువస్తే కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy slams KCR and government
  • రాష్ట్రంలో రైతులను ఆదుకునేవారే లేరంటూ వ్యాఖ్యలు
  • గుండాలకు రావాల్సిన నీటిని పాలకుర్తికి తరలిస్తున్నారని ఆగ్రహం
  • కేసీఆర్ మాట తప్పారంటూ విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో పరిస్థితులపై వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఆనందం కొందరిలో మాత్రమే ఉందని అన్నారు. కరోనా వచ్చినా, తుపాను వచ్చినా రైతులను ఆదుకునే వారే లేరని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. గుండాలకు రావాల్సిన నీటిని ఎర్రబెల్లి అక్రమంగా పాలకుర్తికి తరలిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. గందమళ్ల రిజర్వాయర్ రద్దయినట్టేనని అధికారులు చెప్పారని, బస్వాపూర్ నుంచి గుండాల మండలానికి నీళ్లు రావని వెల్లడించారు. ఏడాది లోగా బస్వాపూర్ నుంచి ఆలేరుకు నీళ్లు తీసుకొస్తే కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తామని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Komatireddy Venkat Reddy
KCR
Irrigation
Projects
Water

More Telugu News