షోలాపూర్ మేయర్, తెలుగు మహిళ కాంచనకు కరోనా
- ఆమె భర్తకు కూడా సోకిన వైరస్
- వారుంటున్న ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన అధికారులు
- తొలి తెలుగు మేయర్‌గా రికార్డు
మేయర్ దంపతులకు కరోనా సోకడంతో వారు ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. ఆమెకు కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆమె ఎక్కడెక్కడ పర్యటించారు? ఎవరిని కలిశారనే వివరాలు రాబడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేటకు చెందిన కాంచన 2019 డిసెంబరులో జరిగిన షోలాపూర్ ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికై ఆ పదవిని అధిష్ఠించిన తొలి తెలుగు మహిళగా రికార్డులకెక్కారు.