మంచిర్యాల సమీపంలో.. రహదారిపై పెద్దపులి!

Tiger Captured in Manchiryala
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకూ చిరుతపులులు జనావాసాల్లోకి రాగా, ఈ దఫా ఏకంగా పెద్దపులే బయటకు వచ్చింది. మంచిర్యాల సమీపంలో రహదారిపైకి ఓ పెద్దపులి వచ్చింది. దీని దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. ఇక ఈ వ్యాఘ్రరాజం ఎటువైపు వెళ్లిందన్న విషయమై ఎటువంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. దీని కదలికలపై ఆరా తీస్తున్నామని, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు.
Go Back to Shorts
Tiger
Mancherial District
CC TV

More Telugu News