కేంద్ర నిబంధనల మేరకు హోటళ్లు, పర్యాటక కార్యకలాపాలు ప్రారంభిస్తాం: అవంతి
- జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్ల ప్రారంభం
- పర్యాటక రంగానికి పూర్వస్థితిని తీసుకువస్తామన్న అవంతి
- లాక్ డౌన్ వల్ల నెలకు రూ.10 కోట్ల మేర నష్టం వస్తోందన్న మంత్రి
రాష్ట్రానికి తీర, అటవీప్రాంతాలు, హిల్ స్టేషన్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రివర్, టెంపుల్ టూరిజం వంటి విశిష్టతలు ఉన్నాయని, పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని, పర్యాటక విభాగాన్ని ఆదాయం తెచ్చే శాఖగా మార్చుతామని చెప్పారు. లాక్ డౌన్ వేళ పర్యాటక శాఖ నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని అన్నారు. గండికోట, హార్సిలీహిల్స్, అరకు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.