Narendra Modi: మోదీ కోసం స్వయంగా గుజరాతీ కిచిడీ చేస్తానన్న ఆస్ట్రేలియా ప్రధాని

modi with scot
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకున్న నేతలు
  • నేను చేసిన సమోసాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను
  • కిచిడీ తనకు ఇష్టమైన వంటకమని మోదీ నాకు చెప్పారు
తాను భారత ప్రధాని మోదీ కోసం స్వయంగా గుజరాతీ కిచిడీ చేస్తానని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్ అన్నారు. వారిద్దరు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోరిసన్ సరదాగా పలు వ్యాఖ్యలు చేశారు.

ట్రేడ్‌మార్క్‌ మోదీ ఆలింగనం కోసం తాను గుజరాత్‌లో ఉండాలనుకుంటున్నానని అన్నారు. తాను చేసిన సమోసాను షేర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే, తాను మోదీ కోసం గుజరాతీ కిచిడీ చేస్తానని, అది ఆయనకు ఇష్టమైన వంటకమని ఆయన గతంలో తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు.
 
అనంతరం మోదీ మాట్లాడుతూ.. మోరిసన్ చేసిన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన తయారు చేసిన సమోసా గురించి భారత్‌లో చాలా మాట్లాడుకున్నారని, ఇప్పుడు కిచిడీ గురించి ప్రస్తావించారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు గుజరాతీలకు సంతోషం కలిగిస్తాయని తెలిపారు. ఆస్ట్రేలియాలో గుజరాతీ కుటుంబాలు చాలా నివసిస్తున్నాయన్నారు.
Narendra Modi
BJP
India
Australia

More Telugu News