Crime News: ఆన్‌లైన్‌లో భార్యను అమ్మకానికి పెట్టిన భర్త... భార్యకు విపరీతంగా ఫోన్లు వచ్చిన వైనం

man sells his wife
  • యూపీలోని  తుథియాలో ఘటన
  • బైక్‌ కోసం డబ్బులు కావాలని భార్యను వేధించిన భర్త
  • పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • ఆమె ఫొటో పోస్ట్ చేసి డబ్బులు చెల్లించి కొనుక్కోవాలని భర్త పోస్టులు  
సామాజిక మాధ్యమాల్లో ఏకంగా తన భార్యనే అమ్మకానికి పెట్టాడో భర్త. ఈ ఘటన ఉత్తర ‌ప్రదేశ్‌లోని మెహ్‌నగర్‌ పోలీస్ ‌స్టేషన్‌ పరిధిలోని తుథియాలో చోటు చేసుకుంది. తాజాగా అతడిని అరెస్టు చేసిన పోలీసులు వివరాలు తెలిపారు. పునీత్‌ అనే వ్యక్తి తన భార్యను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనకు బైక్‌ కావాలని, పుట్టింటి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇవ్వాలని ఆమెను కొడుతున్నాడు. దీంతో ఆమె ఆ వేధింపులు తాళలేక, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి అక్కడే ఉంటోంది.

ఈ క్రమంలో ఆమెపై ఇంకా ఆగ్రహించిన సదరు భర్త.. తన భార్యను అమ్మేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఆమె ఫొటోను, ఫోను నంబరును పోస్ట్ చేశాడు. కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాలని, ఆమెతో మాట్లాడటానికి, సమయం గడపటానికి సంప్రదించాలని కోరాడు. దీంతో ఆమెకు చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్త పునీత్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Crime News
India
Uttar Pradesh

More Telugu News