తిరుమల సత్రాల వద్ద తిరుగుతున్న చిరుత.. భయాందోళనలతో సిబ్బంది
- కర్ణాటక సత్రం వద్ద రెండు రోజులుగా సంచరిస్తున్న చిరుత
- సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
- నిఘా పెంచిన అధికారులు
విషయం తెలిసిన మఠాల్లోని సిబ్బంది భయంతో వణుకుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడం వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. తాజాగా, సత్రాల వద్ద చిరుత తిరుగుతున్న సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.