సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!
- ల్యాండ్ పూలింగ్ సందర్భంగా 3.11 ఎకరాలు ఇచ్చినట్టు చూపిన రావెల గోపాలకృష్ణ
- ప్రతిగా 10 ప్లాట్లు కేటాయించిన సీఆర్‌డీఏ
- తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించినట్టు డిప్యూటీ కలెక్టర్‌పై ఆరోపణలు
ఇందుకు ప్రతిగా 3,100 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు. అలాగే, రూ. 5.26 లక్షల కౌలు చెల్లించారు. నిజానికి రికార్డులలో వీరు చూపిన ఆ భూమి నాగార్జున సాగర్ రెండు రోడ్లకు చెందినది. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ మాధురి తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.