Narendra Modi: మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Prime Minister Narendra Modi chaired Union Cabinet meeting today
షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో జరుగుతోన్న ఈ భేటీలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చిస్తున్నారు.

లాక్‌డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించింది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ అంశాలతో పాటు లడఖ్‌లో చైనాతో ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Narendra Modi
BJP

More Telugu News