Mitron: టిక్ టాక్ కు దీటైన యాప్ అనుకుంటే గూగుల్ తొలగించింది!

  • భారతీయ యాప్ 'మిత్రోన్'కు ప్రజాదరణ
  • 'మిత్రోన్' నిబంధనలు ఉల్లంఘిస్తోందన్న గూగుల్
  • నియమావళికి లోబడే వ్యవహరించామంటున్న 'మిత్రోన్' డెవలపర్స్
Google removes Mitron app from Play Store

చైనా నుంచి అన్ని వస్తువుల్లాగే టిక్ టాక్ యాప్ కూడా విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. అయితే ఈ టిక్ టాక్ కు దీటైన జవాబిచ్చే భారతీయ యాప్ గా  ప్రచారం అందుకుంటున్న 'మిత్రోన్' యాప్ అంతలోనే ప్లే స్టోర్ నుంచి మాయమైంది. అందుకు కారణం గూగుల్. నిబంధనలు పాటించడం లేదంటూ 'మిత్రోన్' యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

స్పామ్ వ్యాప్తి చేయడంతోపాటు, గూగుల్ ప్లే స్టోర్ డెవలపర్ పాలసీల్లో కనీస నియమాలు పాటించడంలేదంటూ 'మిత్రోన్' యాప్ పై గూగుల్ సీరియస్ అయింది. దాంతో 'మిత్రోన్' యాప్ డెవలపర్స్ దీనిపై స్పందించారు. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, తమను తొలగించడాన్ని సవాల్ చేస్తామని తెలిపారు. తాము గూగుల్ నియమావళిని  ఉల్లంఘించ లేదనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

More Telugu News