USA: అమెరికాను అల్లకల్లోలంగా మార్చిన జార్జ్ ఫ్లాయిడ్ మృతి... పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే...?

George Floyd Post Mortem report
  • ఫ్లాయిడ్ మెడపై బలమైన ఒత్తిడి కలిగింది
  • ఒత్తిడి వల్ల మెదడుకు రక్తం సరఫరా కాలేదు
  • ఫ్లాయిడ్ ది నరహత్య
జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మృతితో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతోంది. శ్వేతజాతీయుడైన ఓ పోలీసు అతడిని హత్య చేశాడంటూ నల్లజాతీయులు హింసకు పాల్పడుతున్నారు. పరిస్థితి చేజారిపోతుండటంతో... సైన్యాన్ని దించే ఆలోచనలో అక్కడి ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో, ఫ్లాయిడ్ పోస్ట్ మార్టం నివేదిక వెలువడింది. రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

'ఫ్లాయిడ్ మెడపై బలమైన ఒత్తిడి కలిగింది. ఒత్తిడి వల్ల ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఇది నరహత్య' అని మిన్నెపోలీస్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. ఒత్తిడి కారణంగా మెదడుకు రక్తం సరఫరా కాకపోవడంతో... ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని నివేదికలో వైద్యులు తెలిపారు. దీంతో పాటు మెథాంఫేటమిన్ వాడకం, రక్తపోటు, కొరొనరీ ఆర్టరీ వ్యాధి కూడా మరణానికి కారణమని చెప్పారు.

గత నెల 25న ఫ్లాయిడ్ చనిపోయాడు. డెరెక్ ఛౌవిన్ అనే శ్వేతజాతి పోలీసు అతని మెడపై మోకాలితో బలంగా నొక్కడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఫ్లాయిడ్ మృతికి పోలీసులే కారణమంటూ నల్లజాతీయులు చేపట్టిన ఆందోళనలతో అమెరికా రగులుతోంది.
USA
George Floyd
Murder

More Telugu News