Konaseema: కోనసీమలో కల్లోలం.. ఒకే రోజు భారీగా కరోనా కేసుల నమోదు

28 new corona cases in Konaseema
  • ఒక్కరోజులోనే 28 కరోనా పాజిటివ్ కేసులు
  • కోనసీమను వణికిస్తున్న వలస కూలీలు
  • పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా
ఎటు చూసినా పచ్చదనంతో ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు ఉలిక్కిపడుతోంది. కరోనా మహమ్మారి కోనసీమను కలవరపెడుతోంది. కరోనా నేపథ్యంలో కోనసీమలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేశారు. అయితే, లాక్ డౌన్ ఎత్తివేయడంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు కోనసీమను వణికిస్తున్నారు.

రాజోలు క్వారంటైన్ లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క రోజే 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోనసీమ ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Konaseema
Corona Virus

More Telugu News