Crime News: అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని.. యువకుడిని సజీవ దహనం చేసిన వైనం

man kills in up
  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కలకలం 
  • యువకుడి ఇంటికొచ్చి ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసిన వైనం
  • యువకుడి మృతితో అతడి బంధువుల ఆందోళన
  • పోలీసు వాహనాలకు నిప్పు
ఓ యువకుడిని స్థానికులు సజీవ దహనం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కలకలం రేపింది. భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్ అనే యువకుడు  ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ మహిళకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు.

దాన్ని చూసిన ఆ మహిళ బంధువులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. తమ వర్గానికి చెందిన మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నాడని ఆ మహిళ బంధువులు ఈ రోజు ఉదయం ఆ యువకుడిని ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి నిరసనకు దిగి, పోలీసు వాహనాలను దగ్ధం చేయడం అలజడి రేపింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను పిలిపించారు.
Crime News
Uttar Pradesh

More Telugu News