Kanna Lakshminarayana: 'ఓటుకు నోటు కేసు భయంతో బాబు.. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్'.. అంటూ కన్నా విమర్శలు

kanna laxminarayana fire on chandrababu jagan
  • ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలొచ్చారు
  • కేసీఆర్‌తో స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ వాటిపై నోరు మెదపట్లేదు
  • చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదలచేయాలి
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. 'ఓటుకు నోటు కేసు భయంతో యూటర్న్ తీసుకున్న బాబు వేలకోట్ల రూపాయల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలి కరకట్టకు వచ్చారు. కేసీఆర్‌తో ఉన్న స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం జగన్ వాటిపై నోరు మెదపక వాటిని ఆయనకే అప్పగించారు. చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి' అని ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను ఈ ట్వీట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
Kanna Lakshminarayana
BJP
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
KCR
TRS
Telangana
Andhra Pradesh

More Telugu News