Vellampalli Srinivasa Rao: మీ ట్రావెల్స్ ఉద్యోగులే మిమ్మల్ని ధర్నా చౌక్ లో నిలబెట్టారు: కేశినేని నానికి వెల్లంపల్లి కౌంటర్

AP Minister Vellampalli replies Kesinani Nani in a strong way
  • నాని, వెల్లంపల్లి మధ్య మాటలయుద్ధం
  • శవాల మీద పైసలు సంపాదిస్తున్నావంటూ నాని కామెంట్
  • మీవి చీప్ ట్రిక్స్  అంటూ వెల్లంపల్లి ధ్వజం
శవాల మీద కూడా పైసలు సంపాదించేట్టున్నావు అంటూ తనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడంపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. 'కేశినేని నాని గారూ, మీవి చీప్ ట్రిక్స్' అంటూ మండిపడ్డారు.

 "నిలువు దోపిడీకి నిలువెత్తు నిదర్శనం మీరేనంటూ మీ ట్రావెల్స్ ఉద్యోగులే మిమ్మల్ని ధర్నా చౌక్ లో నిలబెట్టారు. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన మాంత్రికుడు మీరు. మీ హయాంలో చీరల దొంగతనం నుంచి ప్రతిదీ అవినీతిమయమే. ఆఖరికి మీ పచ్చ పత్రిక బాత్రూమ్ టిష్యూగా కూడా ఉపయోగపడదు" అంటూ వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.
Vellampalli Srinivasa Rao
Kesineni Nani
Travels
Vijayawada
Durga Temple

More Telugu News