David Warner: బ్యాక్ గ్రౌండ్లో 'వై దిస్ కొలవెరి'... మరోసారి వార్నర్ హంగామా

Warner takes on Why this kolaveri in his latest Tik Tok video
  • సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తున్న వార్నర్
  • డ్యాన్స్ వీడియోలతో అభిమానులకు వినోదం
  • తాజాగా మ్యాజికల్ స్కిట్
ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సందర్భంగా సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. తెలుగు సినిమా పాటలకు టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా, బ్యాక్ గ్రౌండ్లో 'వై దిస్ కొలవెరి' మ్యూజిక్ వస్తుండగా, ఓ స్కిట్ చేశాడు. తన స్పోర్ట్స్ డ్రస్ ను పక్కన పడేయగా, అందులోంచి మరో వార్నర్ రావడం ఈ మ్యాజికల్ స్కిట్ లో చూడొచ్చు. మొత్తానికి టాలీవుడ్ డ్యాన్సులే కాదు, చిత్రవిచిత్రమైన స్కిట్లతో టిక్ టాక్ లో విపరీతమైన ఫాలోయింగ్ అందుకుంటున్నాడు.

David Warner
Why this kolaveri
TikTok
Tollywood
Australia
Lockdown
Cricket

More Telugu News