para military canteens: పారా మిలిటరీ క్యాంటీన్లలో నేటి నుంచి ఇంపోర్టెడ్ వస్తువుల అమ్మకాలు బంద్

Over 1000 Products Dropped From Paramilitary Canteens
  • మేడిన్ ఇండియా వస్తువులకు చేయూత
  • వెయ్యికి పైగా ఇంపోర్టెడ్ వస్తువుల విక్రయాలకు మంగళం
  • గత నెలలో నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
పారా మిలిటరీ క్యాంటీన్లలో ఇకపై వెయ్యికి పైగా ఇంపోర్టెడ్ ప్రాడక్ట్స్ లభించవు. జూన్ 1 నుంచి మేడిన్ ఇండియా వస్తువులను మాత్రమే క్యాంటీన్లలో అమ్మాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయ పరిశ్రమలకు ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి దిగుమతి చేసుకున్న విదేశీ ఉత్పత్తుల అమ్మకాలను ఆపేశారు. అలా ఆపేసిన వాటిలో హార్లిక్స్ ఓట్స్, కిండర్ జాయ్, న్యూటెల్లా, యూరేకా ఫోర్బ్స్, టామీ హిల్ ఫైగర్ షర్టులు, అడిడాస్ బాడీ స్ప్రేలు, స్కెచర్స్, ఫెర్రీరో, రెడ్ బుల్ తదితర అనేక బ్రాండ్లు ఉన్నాయి.

ఇక క్యాంటీన్లలోని వస్తువులను మూడు క్యాటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో అన్ని మేడిన్ ఇండియా వస్తువులు ఉంటాయి. కేటగిరీ 2లో ముడిసరుకుని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, ఇండియాలో తయారు చేసిన వస్తువులు ఉంటాయి. కేటగిరీ 3లో దిగుమతి చేసుకున్న వస్తువులు ఉంటాయి.

పారా మిలిటరీ క్యాంటీన్లలో ప్రతి ఏడాది సగటున రూ. 2,800 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సశాస్త్ర సీమా బల్, ఎన్ఎస్జీ, అస్సామ్ రైఫిల్స్ బలగాలకు ఈ క్యాంటీన్లు ఉన్నాయి.
para military canteens
imported brands

More Telugu News