Kesineni Nani: అమాత్యా, శవాల మీద కూడా పైసలు సంపాదించేట్టున్నావు: వెల్లంపల్లిపై కేశినేని నాని విమర్శలు

Kesineni Nani criticizes AP Minister Vellampalli
  • వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నావంటూ ఆరోపణ
  • దుర్గగుడిని మింగేస్తున్నావంటూ ట్వీట్
  • ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారమా? అంటూ ఆగ్రహం
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. అమాత్యా ఇదేం పని? అంటూ విమర్శలు గుప్పించారు. "వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నావు. దుర్గగుడిని మింగేస్తున్నావు, వినాయక గుడి ఆదాయం కాజేస్తున్నావు. చివరికి ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో కూడా వ్యాపారం ఏమిటి నాయనా? శవాల మీద కూడా పైసలు సంపాదించేట్టు ఉన్నావు" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మంత్రి అనుచరుడొకరు నకిలీ శానిటైజర్లతో దోచేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని కూడా నాని ట్విట్టర్ లో పంచుకున్నారు.
Kesineni Nani
Vellampalli Srinivasa Rao
Durga Temple
Sanitiser
Andhra Pradesh

More Telugu News