Chiranjeevi: ఉమాపతిరావు పాడె మోసిన చిరంజీవి

Chiranjeevi participated in Umapathirao funerals
  • ఉపాసన తాత ఉమాపతిరావు మృతి
  • దోమకొండలో ముగిసిన అంత్యక్రియలు
  •  గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపిన ప్రైవేట్ సెక్యూరిటీ
చిరంజీవి కోడలైన ఉపాసన తాత ఉమాపతిరావు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి, దోమకొండ సంస్థాన వారసుడైన ఆయన అంత్యక్రియలు దోమకొండ లక్ష్మీబాగ్ లో నిన్న ముగిశాయి. ఆయన కుమారుడు, కోడలు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్... ఉమాపతిరావు పాడె మోశారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉమాపతిరావుకు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు.

అయితే, అంత్యక్రియల సందర్భంగా స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. ఉమాపతిరావు భౌతికకాయాన్ని బయటకు తీసుకొస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అక్కడున్న వారంతా ఇంట్లోకి పరుగులు పెట్టారు.
Chiranjeevi
Tollywood

More Telugu News