ఏపీ సచివాలయానికి కరోనా దెబ్బ... 3,4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధం!

AP Secretariat employ tested corona positive
  • సచివాలయ ఉద్యోగికి కరోనా
  • సచివాలయం మొత్తం శానిటైజ్ చేస్తున్న వైనం
  • విధులకు హాజరుకాని 3, 4 బ్లాకుల ఉద్యోగులు
ఏపీ సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో, సచివాలయం మొత్తం రసాయన ద్రావణాలతో శానిటైజ్ చేస్తున్నారు. 3, 4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధించారు. దాంతో, ఈ రెండు బ్లాకుల ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కాగా, కరోనా సోకిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన మిగతా ఉద్యోగులకు క్వారంటైన్ విధించారు.
Go Back to Shorts
AP Secretariat
Corona Virus
Positive
Sanitise
Quarantine Centre
Andhra Pradesh

More Telugu News