ఇండియాలో కరోనా కేసులపై అసలు వాస్తవమిది: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్!
- లాక్ డౌన్ 1.0, అన్ లాక్ 1.0 మధ్య కేసుల వివరాలు
- 1002 రెట్లు పెరిగిన కొత్త కేసులు
- 68 జిల్లాల నుంచి 634 జిల్లాలకు వ్యాపించిన వైరస్
ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 7వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో భారత్ ఉందని అన్నారు. టెస్టుల తరువాత పాజిటివ్ వస్తున్న కేసుల శాతం 1.3 నుంచి 5 శాతానికి పెరిగిందని, కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు చేరిందని తెలిపారు. జీ-20 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో రెండో స్థానంలోనూ, మరణాల పెరుగుదలలో 4వ స్థానంలోనూ ఇండియా ఉందన్నారు.
మార్చి 20 నాటికి 190 కేసులున్న భారతావనిలో జూన్ 1 నాటికి 1,90,535 కేసులు వచ్చాయని, రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల వారం రోజుల యావరేజ్ అప్పట్లో 16గా ఉండగా, ఇప్పుడు 461 రెట్లు పెరిగి 7,384కు చేరిందని అన్నారు.