కాబోయే భర్తతో చనువుగా ఉండబోయిన యువతి... వద్దన్నందుకు ఆత్మహత్య!
- మేనబావతో యువతికి నిశ్చితార్థం
- ఇంటికి వచ్చిన బావతో యువతి సన్నిహితం
- తండ్రి వారించాడని పురుగుల మందు తాగి ఆత్మహత్య
ఈ క్రమంలో రెండు వారాల క్రితం కృష్ణా రెడ్డి, శివారెడ్డి ఇంటికి రాగా, కవిత అతనితో చనువుగా ఉంది. దాన్ని గమనించిన శివారెడ్డి, కుమార్తెను వారించి, పెళ్లి ముందు సన్నిహితంగా ఉండవద్దని హెచ్చరించాడు. దీంతో కవిత మనస్తాపానికి గురైంది. శుక్రవారం నాడు పురుగుల మందు తాగగా, విషయాన్ని గమనించిన కుటుంబీకులు, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు యశోదా ఆసుపత్రికి తరలించినా కూడా, ఫలితం లభించలేదు. కవిత మృతి చెందగా, విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.