హైదరాబాద్ నుంచి వచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో ముగ్గురికి కరోనా!
- హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న 227 మంది ఉద్యోగులు
- కరోనా భయంతో వణుకుతున్న సచివాలయ ఉద్యోగులు
- సీఎం క్యాంపు ఆఫీసులోని ఓ కానిస్టేబుల్‌కూ కరోనా
ముగ్గురు ఉద్యోగులు కరోనా బారినపడడంతో సచివాలయ ఉద్యోగుల్లో భయం మొదలైంది. దీంతో స్పందించిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.. రేపటి నుంచి వారం రోజులపాటు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు. అలాగే, నెగటివ్‌గా తేలిన వారిని మాత్రం విధుల్లోకి అనుమతించాలన్నారు.
మరోవైపు, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే కర్నూలుకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కూడా కరోనా బారినపడ్డాడు. నాలుగు రోజుల క్రితమే అతడు విధుల్లో చేరగా వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించారు. నిన్న పరీక్ష ఫలితాలు రాగా కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించి మిగతా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.