బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ దగ్ధం
- మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- క్యాంపస్ మొత్తం కమ్మేసిన పొగ
- టేబుళ్లు, కుర్చీలు, ప్రొజెక్టర్ దగ్ధం
అకడమిక్ బ్లాక్ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి విస్తరించాయి. దీంతో క్యాంపస్ మొత్తం పొగతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో క్లాస్‌రూమ్‌లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, 70 కుర్చీలు, 21 టేబుళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.