ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి, అశ్లీల వీడియోకు లైక్ కొట్టిన హ్యాకర్లు.. సోషల్ మీడియాను వదిలేసిన పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం
- వకార్ యూనిస్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
- సోషల్ మీడియాతో తనకు చెడే ఎక్కువగా జరుగుతోందని ఆవేదన
- ఇకపై సోషల్ మీడియాను వాడబోనని ప్రకటన
మనం ఎంతో అభిమానించే వారితో అనుసంధానం కావడానికే సోషల్ మీడియా ఉందని... అయితే, దీని వల్ల తనకు చెడు ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబం కూడా సిగ్గుపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని... అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని తెలిపారు. ఇంకెప్పుడూ తాను సోషల్ మీడియాను వాడబోనని... అభిమానులు తనను క్షమించాలని కోరారు. తనకు అన్నింటికన్నా తన కుటుంబమే ముఖ్యమని చెప్పారు. ఇంకెప్పుడూ తనను సోషల్ మీడియాలో చూడలేరని తెలిపారు.