భారత వాయుసేన మరింత బలోపేతం... తేజస్ యుద్ధ విమానాల ప్రవేశం!
- కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమం
- 'ఫ్లయింగ్ బుల్లెట్స్'లోకి తేజస్ ఎంకే–1
- ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్ గా గుర్తింపు
ఈ తేజస్ ఫైటర్ జెట్ ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసింది. అన్ని పరీక్షలనూ తట్టుకుని నిలిచిన తేజస్ విమానాలను వాయుసేనకు అప్పగించాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది.
తేజస్ ఎంకే–1 ఫోర్త్ జనరేషన్ సూపర్ సానిక్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో అతి తేలికైన, చిన్నదైన యుద్ధ విమానం కావడం విశేషం. ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు. దీని బరువు 6,560 కిలోలు కాగా, 15 కిలోమీటర్ల ఎత్తులోనూ ఎగరగలదు. దీని పొడవు 13.2 మీటర్లు కాగా, 1,850 కిలోమీటర్ల పరిధిలో దూసుకెళుతుంది.