ఫలించని ప్రయత్నాలు.. బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడి మృతి!
- మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం ఘటన
- బోరు వేసిన అరగంటకే అందులో పడిపోయిన సాయివర్ధన్
- 12 గంటలపాటు పడిన శ్రమ వృథా
పంటపొలంలో బోరుబావి వేసిన అరగంటకే సాయివర్ధన్ అందులో పడిపోయాడు. పొలం వద్ద ఎవరి పనుల్లో వారుండగా ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, ఆర్డీవో సాయిరాం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాలుడిని రక్షించేందుకు 12 గంటలపాటు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు విగతజీవిగా బయటకు రావడంతో అందరూ బోరుమని విలపించారు.