ఓ సామాన్యుడి నిస్వార్థ సేవలకు హ్యాట్సాఫ్ చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్
- సదాశివపేటలో లారీడ్రైవర్లు, క్లీనర్ల కడుపు నింపుతున్న సామాన్యుడు
- నిత్యం 180 మందికి భోజనం
- దాచుకోకుండా ఇతరులకు పంచడం అద్భుతమన్న లక్ష్మణ్
ఈ అంశంపై లక్ష్మణ్ స్పందిస్తూ, అంజాద్, అతని కుటుంబం సదాశివపేటలోని లారీ డ్రైవర్లు, కీనర్లకు ఆహారం అందిస్తూ నిస్వార్థ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పరిస్థితులు సవాల్ విసురుతున్న నేపథ్యంలో కూడా ఓ మామూలు వ్యక్తి అద్భుతమైన సేవలు అందించడం సాధారణమైన విషయం కాదని పేర్కొన్నారు. లాక్ డౌన్ రోజుల్లో ఎవరైనా సహజంగా దాచుకోవాలని చూస్తారని, కానీ అంజాద్ అతని కుటుంబసభ్యులు ఉన్నది ఇతరులకు పంచాలనుకోవడం సేవాతత్పరతకు నిదర్శనం అని ప్రశంసల వర్షం కురిపించారు.