శ్రీవారి ఆస్తుల అమ్మకంపై టీటీడీ బోర్డులో ఓటింగ్ చేపట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి
- ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం
- దమ్ముంటే ఓటింగ్ చేపట్టాలన్న భానుప్రకాశ్ రెడ్డి
- ఆస్తుల అమ్మకాన్ని బోర్డులో సగం మంది వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
విపక్షంలో ఉన్నప్పుడు దేవాదాయ భూములు అమ్మరాదని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి, ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. ఆస్తుల అమ్మకాలపై టీటీడీకి హక్కులు లేకుండా పకడ్బందీగా చట్టం చేయాలని సూచించారు. ఈ ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా హిందువులకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఈ నెల 28న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆస్తుల అమ్మకంపై ఓటింగ్ నిర్వహించాలని సవాల్ విసిరారు.