Sai Tej: వరుణ్ తేజ్ సమాధానంపై వెన్నెల కిశోర్ స్పందన!

Vennela Kishor and Nithin response on Varun Tej tweet
  • పెళ్లికి చాలా టైమ్ ఉంది అన్ని వరుణ్
  • ఇది నమ్మదగిన జవాబు అన్న వెన్నెల కిశోర్
  • మీ నంబర్ కూడా వస్తుంది.. బాధ పడొద్దన్న నితిన్
'ఏంటి బావా... నీ పెళ్లంట కదా' అంటూ వరుణ్ తేజ్ ను ఉద్దేశించి సాయితేజ్ ట్విట్టర్లో కొంటెగా ప్రశ్నించిన  సంగతి తెలిసిందే. 'దానికి చాలా టైమ్ ఉందిలే కానీ... మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటామని చెప్పి... సింగిల్ గ్రూప్ నుంచి సింపుల్ గా వెళ్లిపోయారు' అంటూ వరుణ్ తేజ్ సమాధానమిచ్చాడు.

దీనికి హీరో నితిన్ స్పందిస్తూ, 'నీకేముంది డాలింగ్. పెళ్లైపోయింది కాబట్టి ఎన్నైనా డైలాగులు, పంచులు వేస్తావ్' అని అన్నాడు. బ్యాచిలర్ హీరోల గురించి మాట్లాడుతూ, మీ నంబర్ కూడా వస్తుంది, బాధపడకండి బ్రో అని చెప్పాడు.  

ఇక ఇప్పుడు వరుణ్ సమాధానంపై హాస్య నటుడు వెన్నెల కిశోర్ స్పందిస్తూ, 'సింగిల్ రాక్స్, ఎప్పటికీ సింగిల్ గానే ఉంటా, సింగిల్ గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది... ఇలాంటి వాటితో పోల్చుకుంటే... దానికి చాలా టైమ్ ఉందిలే అనేది చాలా నమ్మదగిన జవాబు' అని అన్నాడు. 
Sai Tej
Varun Tej
Vennela Kishor
Nithin
Tollywood

More Telugu News