Dead Bodies: బావిలో మృతదేహాల కేసులో ఇంకా వీడని మిస్టరీ!

Mystery looms over Warangal incident of nine dead bodies
  • వరంగల్ లో పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు
  • మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేని వైనం
  • శవపరీక్షలో ఏమైనా తెలుస్తోందేమోనని భావిస్తున్న పోలీసులు
వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండలో ఓ పాడుబడిన బావిలో 9 మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. వాటిలో 6 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవారివి కావడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోగా, ఇవి ఆత్మహత్యలో, హత్యలో పోలీసులకు కూడా అంతుబట్టడంలేదు.

 ప్రస్తుతానికి అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో భద్రపరిచారు. శవపరీక్ష పూర్తయితే గానీ ఈ వ్యవహారంలో కీలకమైన క్లూ లభించవచ్చని భావిస్తున్నారు. బావిలో శవాలై తేలకముందు అందరూ ఓ చిన్నారి పుట్టినరోజు విందులో పాల్గొన్నట్టు గుర్తించారు.

దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఈ ఘటనలో ఏం జరిగిందన్న దానిపై స్పష్టత వచ్చాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతులు పరాయి రాష్ట్రాలకు చెందినవారు కావడంతో, వారి బంధువులు అంగీకరిస్తే ఇక్కడే వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.
Dead Bodies
Warangal
Well
Police
Mystery

More Telugu News