Entrance: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదిగో!

Entrance exams schedule in Telangana released
  • జూలై 6 నుంచి ఎంసెట్
  • జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్
  • ఎడ్ సెట్ జూలై 15న నిర్వహణ
తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 1న పాలీ సెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్,  జూలై 10న లాసెట్, లా పీజీ సెట్, జూలై 13న ఐసెట్, జూలై 15న ఎడ్ సెట్ నిర్వహించనున్నారు. జూలై 16 తర్వాత పీసెట్ ఫిజికల్ టెస్టులు ఉంటాయి. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు జూలై మాసంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తాజా షెడ్యూల్ తో అర్థమవుతోంది.
Entrance
Tests
Schedule
Telangana

More Telugu News