చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని ధ్వంసం చేయడం బాధాకరం: అశోక్ గజపతి రాజు
- విజయనగరంలో ప్రసిద్ధికెక్కిన మూడు లాంతర్ల స్తంభం
- 1860లో ఏర్పాటైనట్టు చారిత్రక ఆధారాలు
- స్తంభం కూల్చివేత దారుణం అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు
ఈ చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా చాలా చారిత్రక కట్టడాలు కూల్చే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై విజయనగరం పౌరులతో కలిసి శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతామని అన్నారు.
విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న మూడు లాంతర్ల స్తంభం 1860 ప్రాంతంలో ఏర్పాటైనట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడీ స్థూపం స్థానంలో కొత్తది నిర్మించాలని అధికారులు ప్రయత్నిస్తుండడం స్థానికంగా ఎంతో అసంతృప్తి కలిగిస్తోంది.