నా పెళ్లికి చాలా టైముందిలే, కానీ...!: వరుణ్ తేజ్

Varun Tej repiles to Sai Tej comment
  • పిల్లలకు పెళ్లి చేయాలన్న నాగబాబు
  • ఏంటి బావా పెళ్ళంట అంటూ వరుణ్ తేజ్ ను ప్రశ్నించిన సాయితేజ్
  • వెంటనే బదులిచ్చిన వరుణ్ తేజ్
టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సందడి నెలకొంది. ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడు కాగా, త్వరలోనే నితిన్, రానా కూడా బ్రహ్మచర్యానికి గుడ్ బై చెప్పనున్నారు. నితిన్ పెళ్ళి శాలినీతో, రానా వివాహం మిహీకా బజాజ్ తో జరగనుంది. ఈ నేపథ్యంలో నటుడు నాగబాబు తన పిల్లలు నిహారిక, వరుణ్ తేజ్ ల పెళ్ళిళ్ళు కూడా చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు.

దాంతో నాగబాబు మేనల్లుడు సాయితేజ్ చిలిపిగా, "ఏంటి బావా నీకు పెళ్లంట!" అంటూ వరుణ్ తేజ్ ను కవ్వించాడు. దానికి వరుణ్ తేజ్ రిప్లయ్ ఇచ్చాడు. "దానికి ఇంకా చాలా టైముందిలే కానీ.. మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మనందరం కలిసే ఉంటాం అంటూనే సింపుల్ గా సింగిల్ గ్రూప్ నుంచి నిష్క్రమించేశారు" అంటూ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Varun Tej
Sai Tej
Rana
Nithin
Tollywood

More Telugu News