AP High Court: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు... వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు

AP High Court says suspension on AB Venkateswararao not valid
  • కొన్నినెలల కిందట ఏబీని సస్పెండ్ చేసిన ఏపీ సర్కారు
  • హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఏబీ
  • కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు
కొన్నినెలల కిందట మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.... ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు భావించిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లగా, అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది.
AP High Court
AB Venkateswara Rao
Sespension
Andhra Pradesh

More Telugu News