Bony Kapoor: నిర్మాత బోనీకపూర్ నివాసంలో ముగ్గురికి కరోనా పాజిటివ్

Corona tested positive for three maids in Bony Kapoor house
  • తొలుత పనిమనిషి చరణ్ సాహుకి కరోనా
  • ఆపై మరో ఇద్దరికి పాజిటివ్
  • బోనీ కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చిందన్న ప్రతినిధి
స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నివాసంలో ఇప్పటికే చరణ్ సాహు అనే పనిమనిషికి కరోనా సోకిందన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు పనిమనుషులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. దాంతో బోనీ నివాసంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. బోనీకపూర్ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో కలిసి ముంబయిలోని లోఖండ్ వాలా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల చరణ్ సాహు అనే పనిమనిషి అనారోగ్యం పాలవడంతో కరోనా టెస్టు చేయగా, పాజిటివ్ అని తేలింది. దాంతో ఇంట్లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, మరో ఇద్దరికి కూడా వ్యాధి సోకినట్టు గుర్తించారు. బోనీ, జాన్వీ, ఖుషీలకు వైద్య పరీక్షలో నెగెటివ్ వచ్చిందని వారి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం బోనీ, జాన్వీ, ఖుషీ హోం క్వారంటైన్ లో ఉన్నారని వెల్లడించారు.
Bony Kapoor
Maids
Corona Virus
Positive
Mumbai

More Telugu News