సగం ధరకే తిరుమల లడ్డూ... వెంకన్న దర్శనం ఎప్పటినుంచో ఇప్పుడే చెప్పలేను: వైవీ సుబ్బారెడ్డి
- రూ. 50 విలువైన లడ్డు రూ. 25కే
- అన్ని జిల్లాల టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో
- హైదరాబాద్ సమాచార కేంద్రంలో కూడా
- టీటీడీలో నిధుల కొరత లేదన్న వైవీ
ఈ- హుండీ ద్వారా స్వామివారికి వస్తున్న ఆదాయం పెరిగిందని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి, గత సంవత్సరం ఏప్రిల్ లో రూ. 1.79 కోట్లు రాగా, ఈ సంవత్సరం రూ. 1.97 కోట్ల ఆదాయం కానుకల రూపంగా వచ్చిందన్నారు. టీటీడీలో నిధుల కొరత ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసిన ఆయన, ఆలయాల నిర్వహణకు, ఉద్యోగుల వేతనాలకు ఎలాంటి కొరతా లేదని, స్వామి అనుగ్రహంతో భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి రాబోదన్న నమ్మకం ఉందని తెలిపారు.