నా భార్య హీరోయిన్ అయితేనే ఆ సినిమాలో నటిస్తా: కోహ్లీ
- బాలీవుడ్ లో క్రికెటర్ల బయోపిక్ ల హవా
- కోహ్లీ బయోపిక్ పై ఆసక్తి చూపుతున్న దర్శక, నిర్మాతలు
- నా బయోపిక్ లో నేనే హీరోగా నటిస్తానంటూ కోహ్లీ సరదా వ్యాఖ్య
ట్విట్టర్ లైవ్ చాట్ లో కోహ్లీ మాట్లాడుతూ, తన బయోపిక్ నిర్మిస్తే... తానే హీరోగా ఉంటానని కోహ్లీ చెప్పాడు. తన భార్య అనుష్క శర్మ హీరోయిన్ గా ఉంటేనే తాను నటిస్తానని కండిషన్ కూడా పెట్టాడు. మరి కోహ్లీ కండిషన్లకు ఒప్పుకుని ఏ నిర్మాత, దర్శకుడు అవకాశాన్ని దక్కించుకుంటాడో వేచి చూడాలి.