తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ అందని రికార్డు... 'అల వైకుంఠపురములో'కు 100 కోట్ల వ్యూస్!
- యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్ కు బిలియన్ వ్యూస్
- వెల్లడించిన గీతా ఆర్ట్స్
- సినిమాకు రికార్డు మీద రికార్డు
యూ ట్యూబ్ లో సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్ ద్వారా తెలియజేసిన గీతా ఆర్ట్స్, "మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు" అని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించగా, ప్రతి పాటా హిట్ అయింది. సినిమా విడుదలై నాలుగు నెలలు అయినా, రికార్డు మీద రికార్డును సొంతం చేసుకుంటూనే ఉండటం విశేషం.