కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. వీడియో ఇదిగో
- భారత్ చాలా గొప్ప దేశం
- ఆ దేశ ప్రధాని మోదీ నాకు ఓ మంచి స్నేహితుడు
- మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం
- వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి
'మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం. కరోనా విపత్కర సమయంలో భారత్‌కు, మోదీకి మద్దతుగా నిలుస్తాం. వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. కంటికి కనపడని శత్రువుని ఇరు దేశాలు కలిసి ఓడిస్తాయి' అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.