ఒంగోలులోని మినో ఫామ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో కార్మికుల పరుగులు
- పేర్నమిట్ట సమీపంలో ఘటన
- కార్మికులు శానిటైజర్లు తయారు చేస్తుండగా ప్రమాదం
- రెండో అంతస్తులో దట్టమైన పొగలు
ఈ రోజు ఉదయం పేర్నమిట్ట సమీపంలోని మినో ఫామ్ ఔషధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో కార్మికులు శానిటైజర్లు తయారు చేస్తుండగా అందులో వినియోగించే ఆల్కహాల్ కారణంగా ప్రమాదం సంభవించిందని సమాచారం. ఆ పరిశ్రమలోని రెండో అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పరిశ్రమ నుంచి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీస్తూ కనపడ్డారు.