'రాములో రాములా' పాటకు మరోసారి స్టెప్పులు వేసిన డేవిడ్ వార్నర్.. వీడియో ఇదిగో
- ఇటీవల బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్
- రాములో రాముల పాటకు చాలా వెరైటీగా ప్రయోగం చేసిన వార్నర్
- బన్నీ అభిమానులను ఖుషీ చేస్తోన్న వరస వీడియోలు
ఇప్పుడు డేవిడ్ వార్నర్ సింగిల్‌గా అదే పాటకు మరోసారి డ్యాన్స్ చేసి బన్నీ అభిమానులను ఖుషీ చేశారు. ఈ పాటకు ఆయన చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్ అవుతోంది. కరోనాతో ఐపీఎల్ జరగకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ పదే పదే టిక్‌టాక్ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఆయన ప్రత్యేకించి తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తుండడం గమనార్హం. ఆయన పోస్ట్ చేస్తోన్న ప్రతి వీడియో తెలుగు సినీ అభిమానులను అలరిస్తోంది.