కరోనా అప్‌డేట్‌: దేశంలో 24 గంటల్లో 3,967 మందికి కరోనా.. మొత్తం కేసులు 81,970

100 deaths in India in 24 hours  3967 cases
  • గత 24 గంటల్లో భారత్‌లో 100 మంది మృతి
  • కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,649
  • కరోనా నుంచి కోలుకున్న 27,920
  •  ఆసుపత్రుల్లో 51,401 మందికి చికిత్స
భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 3,967 మందికి కొత్తగా కరోనా సోకింది.

గత 24 గంటల్లో భారత్‌లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,649కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 81,970కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 27,920 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 51,401 మంది చికిత్స పొందుతున్నారు.  
Go Back to Shorts
Corona Virus
COVID-19
Lockdown
India

More Telugu News