ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ను సర్ ప్రైజ్ చేసిన ఢిల్లీ పోలీసులు
- మేరీ కోమ్ తనయుడి పుట్టినరోజున కేక్ తెచ్చిన పోలీసులు
- సంభ్రమాశ్చర్యాల్లో మునిగిన మేరీకోమ్ కుటుంబం
- మీరు యోధులు అంటూ సెల్యూట్ చేసిన బాక్సర్
తన కుమారుడి పుట్టినరోజు అని తెలుసుకోవడమే కాకుండా, ఓ కేక్ కూడా తీసుకురావడం పట్ల మేరీ కోమ్ కదిలిపోయారు. వారికి సెల్యూట్ చేశారు. కరోనాపై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న యోధులు మీరు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ పాట కూడా పాడడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమైన వేళ తమ కుటుంబంలో ఆనందం నింపారంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, ఏసీపీ ప్రగ్యా ఆనంద్ కు మేరీ కోమ్ కృతజ్ఞతలు తెలిపారు.