ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
- ట్రాక్టర్ పై తెగిపడిన విద్యుత్ తీగలు
- మృతుల్లో ఏడుగురు మహిళలు
ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు మహిళలు, ఒక రైతు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 15 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
లాక్ డౌన్ వెసులుబాటు నేపథ్యంలో వీరంతా ఈ ఉదయం మిరప కోత పనులకు వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పింది. వేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో, కరెంట్ తీగలు ట్రాక్టర్ పై పడ్డాయి. దీంతో కరెంట్ షాక్ కొట్టి 9 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.