ఆదాయం తగ్గింది.. మద్యంపై ట్యాక్స్ పెంచాం: కేరళ ప్రభుత్వం
- బీరు, వైన్ పై 10 శాతం అమ్మకం పన్ను పెంపు
- ఇతర మద్యం రకాలపై 35 శాతం పెంపు
- లాక్ డౌన్ కారణంగా కీలక ఆదాయాలు కోల్పోయామన్న ప్రభుత్వం
మరోవైపు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో ఖర్చులను తగ్గించుకోవాలని కూడా కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి అవసరమైన ప్రతిపాదనలు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి రూ. 3,434 కోట్ల సాయాన్ని అందించాలనే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.