Pavan kalyan: అదంతా పుకారేనన్న హరీశ్ శంకర్!

Harish Shankar Movie
షార్ట్స్‌లో చూడండి
చాలాకాలం క్రితం పవన్ కథానాయకుడిగా దర్శకుడు హరీశ్ శంకర్ 'గబ్బర్ సింగ్' సినిమాను తెరకెక్కించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇంతకాలానికి పవన్ తో మరో సినిమా చేయనున్నామని ఇటీవల హరీశ్ శంకర్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా మానస రాధాకృష్ణన్ అనే మలయాళ ముద్దుగుమ్మను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే మలయాళ సినిమాలతో బిజీ అవుతున్న ఈ సుందరి, పవన్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుందని చెప్పుకున్నారు.

మలయాళ భామలు తెలుగు తెరపై తమ జోరు చూపుతున్న కారణంగా అంతా ఈ వార్త నిజమేనని అనుకున్నారు. అయితే, అందులో ఎంత మాత్రం నిజం లేదని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని చెప్పారు. తన సినిమాలకి సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని అన్నారు. ఈ పుకారు ఎక్కడ పురుడు పోసుకుందో తెలియదుగానీ, హరీశ్ శంకర్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఇప్పుడు పవన్ సరసన కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
Pavan kalyan
Harish Shankar
Tollywood

More Telugu News