రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడనున్నారు. ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, మద్యం అంశం, విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన వంటి వాటిపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ‘మహానాడు’ నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.