లాక్డౌన్పై ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించనున్న ప్రధాని మోదీ
- ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగం
- లాక్డౌన్ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై మాట్లాడనున్న మోదీ
- మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు
దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మోదీకి సీఎంలు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు మోదీ సిద్ధమయ్యారు. ఆయన ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. లాక్డౌన్ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగించనున్నారు.
కాగా, తొలి దశ లాక్డౌన్లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, అలాగే, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని మోదీ నిన్న సీఎంలతో అన్నారు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.